Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జలం కోసం రుణం!

జలం కోసం రుణం!

‘సాగునీటి’కి ప్రత్యేక కార్పొరేషన్‌
నిధుల సేకరణకు సర్కారు వ్యూహం
30వేల కోట్లు దాటిన ప్రాజెక్టులన్నీ కార్పొరేషన్‌ పరిధిలోనే
జల వనరుల శాఖపై సీఎం సమీక్ష
ప్రాధాన్య జాబితాపై అసంతృప్తి
వరదొచ్చినా ప్రాజెక్టులు నిండలేదేం?
అధికారులపై జగన్‌ మండిపాటు
40 రోజుల్లో నింపాలని గడువు
అమరావతి: భారీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు వీలుగా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. రూ.30,000 కోట్లకు పైబడి వ్యయమయ్యే ప్రాజెక్టులను కార్పొరేషన్‌ ద్వారా చేపట్టడమే మంచిదన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్దఎత్తున సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని జల వనరుల శాఖకు సూచించారు. ఈ నిర్మాణాలకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నందున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు… కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖపై సీఎం సమీక్ష జరిపారు. జల వనరుల మంత్రి పి.అనిల్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, కృష్ణా డెల్టా సిస్టమ్‌, పోలవరం సాగు నీటి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రాధాన్య ప్రాజెక్టులు పీ-1 జాబితా.. అప్రధాన జాబితా పీ-2లో ఉన్న పథకాలపైన, అధికారుల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌పైన ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాధాన్య జాబితాలోని ప్రాజెక్టుల వ్యయం రూ.20,000 కోట్లకు మించి ఉండడం.. అప్రాధాన్య జాబితాలోని ప్రాజెక్టుల వ్యయం రూ.1200 కోట్లు మాత్రమే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నీ రద్దు చేయక్కర్లేదు…
హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తవ్వాలని.. అది చేయకుండా దానితో అనుసంధానించిన ప్రాజెక్టులు పూర్తయినా నిష్ఫలమేనని జగన్‌ స్పష్టం చేశారు. ప్రాధాన్య ప్రాజెక్టులను నిర్ణయించేటప్పుడు కాస్త ఆలోచించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో 25 శాతంలోపు చేపట్టిన అన్నిటినీ రద్దు చేయాల్సిన అవసరం లేదని.. వాటిని కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని సరిచేసి వచ్చే నెల 8వ తేదీన మరోసారి భేటీ అవుదామన్నారు. అప్పటి భేటీకి ఆదిత్యనాథ్‌దాస్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, రాయలసీమ సీఈ నారాయణరెడ్డి హాజరైతే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటో.. ఏయే ప్రాజెక్టులను నిలిపివేస్తారో తేలిపోతుందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *