విశాఖపట్నం: భారత్‌తో తొలి టెస్టులో సౌతాఫ్రికా మిడిలార్డర్ గొప్పగా రాణించింది. తొలి ఇన్నింగ్స్‌ను తడబడుతూ ఆరంభించిన ప్రొటీస్ శుక్రవారం ఆటలో గట్టిగా పుంజుకుంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ మెరుపు శతకంతో చెలరేగాడు. అశ్విన్ వేసిన 105వ ఓవర్ తొలి బంతికి తనదైన శైలిలో భారీ సిక్సర్ బాది 100 మార్క్ చేరుకున్నాడు. డికాక్ ఓపెనర్ డీన్ ఎల్గర్(160)తో భారీ భాగస్వామ్యం నెలకొల్పిన డికాక్ స్వేచ్ఛగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెయిలెండర్ ముత్తుసామితో సఫారీకు భారీ స్కోరు అందించే దిశగా పోరాడుతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 105 ఓవర్లలో 6 వికెట్లకు 365 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. డికాక్(107), ముత్తుసామి(4) క్రీజులో ఉన్నారు. శుక్రవారం భారత బౌలర్లను సఫారీ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. డికాక్‌ను ఔట్ చేసి స్వల్ప వ్యవధిలోనే టెయిలెండర్లను పెవిలియన్ పంపి ఆధిక్యం సంపాదించాలని కోహ్లీసేన భావిస్తోంది.
