Breaking News
Home / States / డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి….

డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి….

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ ఐకాస సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేలా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో సోమేశ్‌ కుమార్‌ కమిటీ సమావేశమైంది. సోమేశ్‌ కుమార్‌తో పాటు అధికార బృందం సునీల్‌ శర్మ, రామకృష్ణారావు చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు ఇప్పటికే ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐకాస నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారేం చెబుతారో వింటామనీ.. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయం తీసుకోకుంటే సమ్మెకు దిగుతామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *