Breaking News
Home / National / ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం….

ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం….

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాహనాల కాలుష్యం పెచ్చుపెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను అనూహ్యంగా పెంచడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో కారు పార్కింగ్ ఫీజును రూ.1000 వసూలు చేయాలని ఢిల్లీ అధికారుల కమిటీ నిర్ణయించింది. ఢిల్లీలో 3.3 మిలియన్ల కార్లు, 73.0 మిలియన్ల ద్విచక్రవాహనాలున్నాయి. ఢిల్లీవాసులు రోజుకు 500 కార్లు కొత్తగా కొనుగోలు చేస్తున్నారు. రోడ్లపై ప్రైవేటు కార్లు ఎక్కువగా తిరగకుండా, పార్కింగ్ స్థలాల్లో కార్లు పార్కింగ్ ను తగ్గించేందుకు వాహనాల పార్కింగ్ చార్జీలను అనూహ్యంగా పెంచాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. పార్కింగ్ స్థలం, వాహనం పార్కింగ్ చేసిన సమయం, ప్రాంతం, వేళలను బట్టి పార్కింగ్ ఫీజును నిర్ణయించామని ఢిల్లీ రవాణా కమిషనర్ చెప్పారు. ఢిల్లీలోని లజపత్ నగర్, కరోల్ బాగ్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఉన్నందువల్ల పార్కింగ్ ఫీజులు అధికంగా వసూలు చేయాలని సర్కారు నిర్ణయించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *