టొమాటో సూప్
కావాల్సిన పదార్ధాలు: టొమాటోలు – అరకేజీ, అల్లం – చిన్నముక్క, ఆలివ్ ఆయిల్ – రెండు టేబుల్స్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి, బిర్యానీ ఆకు – ఒకటి, టొమాటో ప్యూరీ – అరకప్పు, తులసి ఆకులు – కొన్ని, మిరియాలు – ఒక టీస్పూన్, బ్రెడ్ ముక్క – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – మూడు, ఉప్పు – తగినంత.
తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలు, టొమాటోలు కట్ చేసుకోవాలి. అల్లంను దంచుకోవాలి. ఒక చిన్నపాత్రలో అల్లం, కొద్దిగా ఉప్పు, ఆలివ్ ఆయిల్ వేసి ఓవెన్లో వేడి చేయాలి. మరొక పాత్రలో ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి, కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. కాసేపయ్యాక టొమాటో ప్యూరీ, తులసి ఆకులు, మిరియాల పొడి వేయాలి. ఓవెన్లో వేడి చేసుకున్న అల్లం వేయాలి. టొమాటోలు ఉడికే వరకు ఉంచి స్టవ్ నుంచి దించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీ పట్టుకోవాలి. తులసి ఆకులతో గార్నిష్ చేస్తే నోరూరించే టొమాటో సూప్ రెడీ….