Breaking News
Home / hyderabad / ప్రజాస్వామ్య పరిక్షణ ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం

ప్రజాస్వామ్య పరిక్షణ ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం

హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిక్షణ ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జాతీయ పార్టీల కారణంగానే ప్రజస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన విమర్శించారు. దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, పార్లమెంట్‌లో వాటి ప్రాధాన్యత అంతగా లేదని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన అనంతరం ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏక పార్టీ అధికారంలో ఉంటే నియంత పాలననే కొనసాగుతుందని అసదుద్దీన్ అన్నారు.

‘‘దేశానికి మరిన్ని ప్రాంతీయ పార్టీలు కావాలి. జాతీయ పార్టీల వల్ల దేశం చాలా కోల్పోయింది. ప్రజాస్వామ్యాన్ని బలపర్చాలంటే ప్రాంతీయ పార్టీలు మరిన్ని సంఖ్యలో ఉండాలి, మరింత బలంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్య విధానానికి పూర్తి విరుద్దం’’ అని అసదుద్దీన్ అన్నారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *