Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక ….

సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక ….

అమరావతి:  విజయవాడలోని సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్‌ హాస్టల్‌. .సమయం సాయంత్రం ఆరున్నర. .పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించడంతో హాస్టళ్లలో విద్యార్థులు పట్టుదలతో చదువుతున్నారు. నిశ్శబ్ద వాతావరణంలో పుస్తకాలలో లీనమైపోయారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్టడీ అవర్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు సరఫరా చేశారు. అలాగే సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌తో సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్‌ హాస్టళ్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంగ్లిష్, హిందీ, మ్యాథమ్యాటిక్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా ట్యూషన్‌ చెప్పిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంపునకు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. హాస్టళ్లు, స్కూళ్లలో విద్యార్థుల చదువుపై పర్యవేక్షణతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *