Breaking News
Home / States / Andhra Pradesh / నా వైపు న్యాయం ఉంది… న్యాయమే గెలుస్తుంది..

నా వైపు న్యాయం ఉంది… న్యాయమే గెలుస్తుంది..

విజయనగరం : ఎస్టీ కుల వివాదంపై డిప్యూటి సీఎం పుష్ప శ్రీవాణి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్‌ పిటిషన్‌ వేశారని తెలిసింది కానీ, తనకు నోటీసులు రాలేదన్నారు. 2014 లో కూడా టీడీపీ నేతలు ఎలక్షన్‌ పిటిషిన్‌ వేశారని, కోర్టు కొట్టేసిందని తెలిపారు. అప్పుడు వెనక ఉండి పిటిషన్‌ వేయించిన వారే..ఇప్పుడు డైరక్ట్‌ గా తన మీద ఎలక్షన్‌ పిటిషన్‌ వేశారని అన్నారు. 2008 నుండి తనపై ఆరోపణలు చేస్తున్నారని కానీ, నిరూపించలేకపోయారని చెప్పారు. తన వైపు న్యాయం ఉందని న్యాయమే గెలుస్తుందని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *