కందుకూరు: మహేశ్వరం మండలం, తుమ్మలూరు గ్రామానికి చెందిన కావలి యశోద, భర్త వెంకటయ్య పేరున 239 సర్వే నంబర్లో 16 ఎకరాలు, 240లో 10ఎకరాలు, 250లో 8ఎకరాలు, 251లో 6 ఎకరాలు, మొత్తం 40 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై వివాదం ఉండడంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ భూమికి సంబంధించి ఇనాం కావడంతో ఓఆర్సీ తీసుకోవల్సి ఉండడంతో యాచారం మండలానికి చెందిన కేశమోని వెంకటయ్య, నోముల గ్రామానికి చెందిన బుట్టి బాల్రాజ్లు కలిసి కావలి వెంకటయ్య అతని భార్య యశోద అనుమతితో మాడ్గుల మండల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ సలహాలు, సూచనలతో ఆర్డీవో సంతకాలను ఫోర్జరీచేసి ఓఆర్సీ పత్రాలను తయారు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కందుకూరు ఆర్డీవో రవీందర్రెడ్డి కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ జంగయ్య కేసు దర్యాప్తు చేపట్టి కేశమోని వెంకటయ్య, బుట్టి బాల్రాజ్, వెంకటేశ్, యశోదలను అరెస్ట్ చేయగా వీరికి సహకరించిన డిప్యూటీ తహసీల్దార్ తప్పించుకున్నాడు. గురువారం అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
