Breaking News
Home / National / పాత్రికేయుడి హత్య కేసులో డేరా బాబా దోషి

పాత్రికేయుడి హత్య కేసులో డేరా బాబా దోషి

న్యూఢిల్లీ : డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ ఓ హత్య కేసులో దోషి అని పంచకుల స్పెషల్ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పాత్రికేయుడు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో బాబాతోపాటు మరో ముగ్గురు దోషులని కోర్టు నిర్థారించింది. వీరికి శిక్షలను ఈ నెల 17న ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

ఛత్రపతి ‘పూరా సచ్’ పేరుతో ఓ పత్రికను నడిపేవారు. తన పత్రికకు ఓ గుర్తు తెలియని వ్యక్తి లేఖ రాశారని, డేరా సచ్చా సౌదా ప్రధాన కేంద్రంలో బాలికలు, మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారని చెప్తూ, ఆ వివరాలను ప్రచురించారు. అనంతరం 2002 అక్టోబరులో ఛత్రపతి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో గాయపడి, ఆ తర్వాత మరణించారు.

ఛత్రపతి హత్యపై 2003లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును 2006లో సీబీఐకి అప్పగించారు. 2017 ఆగస్టు 25న కోర్టు ఇచ్చిన తీర్పులో డేరా బాబా రామ్ రహీం ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో దోషిగా ప్రకటించింది. 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన రోహ్‌తక్‌లోని సునరియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Check Also

కన్నీరుపెట్టిస్తున్న ఓ అమర జవాను కథ…..

Share this on WhatsAppపుణె: వ్యాధితో బాధపడుతోందని తెలిసీ ప్రేమ వివాహం చేసుకుని ఓ యువతికి జీవితాన్ని ప్రసాదించాడు. ఎల్లప్పుడూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *