Breaking News
Home / States / పట్టాలు తప్పిన బీసీఎమ్‌.. పలు రైళ్లు రద్దు…

పట్టాలు తప్పిన బీసీఎమ్‌.. పలు రైళ్లు రద్దు…

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్‌ సమీపంలోని మన్నెంకొండ రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్‌పై  బీసీఎమ్‌ (కంకర శుభ్రం చేసే యంత్రం) పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. హైదారాబాద్‌ నుంచి ప్రత్యేక క్రేన్‌ తీసుకొచ్చి పట్టాలు తప్పిన బీసీఎమ్‌ యంత్రాన్ని పక్కకు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించారు. కాచిగూడ-కర్నూలు టౌన్‌ ప్యాసింజర్‌ బాలానగర్‌ స్టేషన్‌ వరకు రాగా తిరిగి కాచిగూడ పంపించివేశారు.

Check Also

హుజూర్‌నగర్ లో సీఎం సభ రద్దు…

Share this on WhatsAppహైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ పర్యటన రద్దయింది. ఈరోజు సాయంత్రం అక్కడ సీఎం సభ జరగాల్సి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *