Breaking News
Home / States / ‘సీఎం కేసీఆర్ పెంపుడు కుక్క మృతి కేసు వివరాలను ఇవ్వలేం’

‘సీఎం కేసీఆర్ పెంపుడు కుక్క మృతి కేసు వివరాలను ఇవ్వలేం’

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ‘హస్కీ’ అనే పెంపుడు కుక్క గత నెలలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డాక్టర్ రంజీత్‌పై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన కేసు వివరాలను ఇవ్వాలంటూ గంజి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద బంజారాహిల్స్ పోలీసులను కోరారు. అయితే ఎఫ్ఐఆర్ కాపీ, ఫిర్యాదు నకళ్లు ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఇవ్వడం కుదరదన్నారు. దర్యాప్తుకు భంగం కలిగే అవకాశముందంటూ అభ్యర్థనను తిరస్కరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *