ముంబయి: ముంబయి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మంగల్ ప్రభాత్ లోధా ముంబయిలోని మలబార్ హిల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రభాత్ ఆస్తులు రూ. 441 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో తేలింది. ప్రభాత్, ఆయన భార్యకు సంబంధించి రూ. 252 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. చరాస్తులేమో రూ. 189 కోట్లు ఉండగా రూ. 14 లక్షల విలువ చేసే కారు ఉంది. అప్పులు రూ. 283 కోట్లు ఉన్నాయి. దక్షిణ ముంబయిలో ఐదు బహుళ అంతస్తుల భవనాలు, రాజస్థాన్లో ఒక ప్లాట్ ఉంది. ఇక ఈయనపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీన జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 24న నిర్వహించనున్నారు.
