Breaking News
Home / National / ప్రధాని మోదీపై దేవేగౌడ వ్యాఖ్యలు…

ప్రధాని మోదీపై దేవేగౌడ వ్యాఖ్యలు…

బెంగుళూరు: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఐటీ, ఈడీ, సీబీఐలను ప్రధాని మోదీ తన సొంత నిర్ణయాలకు ఉపయోగించుకుంటున్నారని మాజీ ప్రధాని దేవేగౌడ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీలో ఉన్నవారంతా సత్యహరిశ్చంద్రులే అంటూ ఎద్దేవా చేశారు. పరమేశ్వర్‌పై ఐటీ దాడి విషయమై మాట్లాడుతూ.. పరమేశ్వర్‌ ఇప్పటికిప్పుడు సంపాదించింది ఏమీ లేదని ఆయన తండ్రి స్థాపించిన మెడికల్‌ కాలేజీ కాలం నుంచే శ్రీమంతుడన్నారు. మీడియాను నియంత్రించాలనుకోవడం ప్రజా ప్రభుత్వ ఆశయాలకు వ్యతిరేకమని దేవేగౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభలో ఎలక్ట్రానిక్‌ మీడియాను నియంత్రించేలా స్పీకర్‌ ఆదేశాలు సరికాదన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *