హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ లోపే మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్లో రూ.1,030 కోట్లు పెట్టామని, 141 మున్సిపాలిటీలకు రూ.2,061 కోట్లను విడుదల చేస్తామన్నారు. పంచాయతీలకు రూ.339 కోట్లు విడుదల చేస్తున్నామని, త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ధి అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదని, పట్టణ ప్రగతికి కూడా ప్రణాళిక తీసుకొస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
