Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మార్చారు….

ఏపీని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మార్చారు….

గుంటూరు: ‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాను’ అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఒక్క మాటతో తేల్చిచెప్పారు. గత కొన్ని రోజలుగా అవినాష్ టీడీపీని వీడి  వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఆయన క్లారిటీ ఇచ్చారు. సోమవారం గుంటూరులో ప్రెస్‌మీట్ నిర్వహించిన అవినాష్.. వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

‘వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది. ఆకలి తట్టుకోలేక చోరీలకు పాల్పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 24న టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక కొరత విషయంలో దీక్షలు చేపడుతున్నాం. టీడీపీలో యాక్టివ్ నేతలపై అధికార పార్టీ తప్పుడు కేసులు పెడుతోంది. తమ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. నిరుద్యోగులుకు పూర్తి స్థాయి న్యాయం జరగడంలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు’ అని అవినాష్ విమర్శలు గుప్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *