Breaking News
Home / States / Andhra Pradesh / దగా, మోసం కలిపితే ఆయన ప్రభుత్వం….

దగా, మోసం కలిపితే ఆయన ప్రభుత్వం….

విజయవాడ: 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే సీఎం జగన్‌కు కేవలం 3 లక్షల మందే కనిపించారా? అని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. రైతు భరోసా 15 విడతలు చేసి మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దగా, మోసం కలిపితే జగన్‌ ప్రభుత్వమని దుయ్యబట్టారు. సోమశిల, కండలేరులో 150 టీఎంసీల నీళ్లు నిలబడితే ఇప్పుడు వదిలేశారని ఉమ చెప్పారు. జలశక్తిశాఖ ఉత్తరాలకు జగన్‌ సమాధానం ఎందుకు చెప్పట్లేదు? అని ప్రశ్నించారు. ఏడాదిలో పూర్తయ్యే పోలవరాన్ని ఐదేళ్లకు పెంచారని అన్నారు. ధరల స్థిరీకరణతో టమాటా రైతు పరిస్ధితి ఏమిటి ? అని దేవినేని ప్రశ్నించారు. 4 నెలల్లో 129 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. దీనికి జగన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *