Breaking News
Home / States / Andhra Pradesh / ఫ్లెక్సీలు ఎక్కువ… పని తక్కువ…

ఫ్లెక్సీలు ఎక్కువ… పని తక్కువ…

విజయవాడ: దుర్గమ్మను‌ మాజీ మంత్రి దేవినేని ఉమ దర్శనం చేసుకున్నారు. క్యూలైన్‌లో నడుచుకుంటూ‌ వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈసారి అధికార పార్టీ నేతల హడావుడే ఎక్కువుగా కనిపించిందని ఆరోపించారు. ఫ్లెక్సీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వంద రూపాయల టిక్కెట్లను వీఐపీ ముద్రలు వేసి అమ్ముకుంటున్నారని విమర్శించారు. అమ్మవారి టిక్కెట్లను కూడా రీసైక్లింగ్ చేస్తున్నారన్నారు. సాధారణ భక్తులు‌ మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం రాజమార్గంలో‌ వెళ్తున్నారన్నారు. ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి.. రోజు గడవటమే కష్టంగా ఉందని చెప్పారు. అందుకే ఈసారి దసరా ఉత్సవాలకు భక్తులు సంఖ్య తగ్గిందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *