Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా.. టైం స్లాట్, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. కాగా శనివారం ద్వాదశి ఆస్థానం, ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4.30- 5.30 గంటల మధ్య ఉభయ దేవేరి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తిని తిరుచ్చిలో ఆశీనులుచేసి తిరుమాడవీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత 6- 7:30 గంటల మధ్య స్వామి, అమ్మవార్లను బంగారువాకిలిలో వేంచేపుచేసి, పురాణపఠనంతో అర్చకస్వాములు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.

Check Also

పెళ్లికి వచ్చినవాళ్ళకు విందు భోజనం పార్సిల్ ..

Share this on WhatsAppకరోనా దెబ్బకు ఎక్కడి అక్కడే ఆగిపోయాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు , పూజలు , అన్ని ఆగిపోయాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *