Breaking News
Home / States / రాజరాజేశ్వరీ దేవాలయానికి పెరిగిన భక్తుల రద్దీ…

రాజరాజేశ్వరీ దేవాలయానికి పెరిగిన భక్తుల రద్దీ…

వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ తారస్థాయిలో ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తుండడంతో భక్తులు మొదట రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు ముందుగా ధర్మగుండంలో స్నానమాచరించి, ఆ తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం శీఘ్రదర్శనాలకు నాలుగు గంటలకు పైగా క్యూలల్లో నిలబడి… స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. కాగా… భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని పూజలు, అభిషేకాలు, ఆర్జిత సేవలను నిలిపి వేసి ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో కృష్ణవేణి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Check Also

ఏపీలో కొత్తగా 33 కరోనా‌ కేసులు…

Share this on WhatsAppఅమరావతి : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *