విశాఖపట్నం: గురువారం నాగుల చవితి కావడంతో చవితి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంప్రదాయ రీతిన ఘనంగా నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా భక్తులు పుట్టలో పాలు పోసి పూజలు చేస్తున్నారు. విశాఖలో ప్రజలు నగరంలోని జూపార్క్, ఏయు గ్రౌండ్స్, పోర్టు స్టేడియం, మధవధార పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు భక్తులతో రద్ధీగా కనిపించాయి. భారతీయులు నాగ వంశీయులు అన్న భావంతో పంటలు పండటంలో నాగులు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నాగుల చవితి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
