Breaking News
Home / States / Andhra Pradesh / దుర్గమ్మను సరస్వతీదేవిగా దర్శించుకునేందుకు భక్తులు వెల్లువలా తరివచ్చారు…

దుర్గమ్మను సరస్వతీదేవిగా దర్శించుకునేందుకు భక్తులు వెల్లువలా తరివచ్చారు…

అమ్మవారి దర్శనానికి 3.30 గంటలు
వినాయకుడి గుడి వయా ఘాట్‌రోడ్డు , ఇంద్రకీలాద్రి
ఓర్పుతో దర్శనం చేసుకున్న భక్తులు
టోల్‌గేట్‌ వద్ద రోప్‌ పార్టీతో హోల్డింగ్‌
విజయవాడ: సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను ఆమె జన్మనక్షత్రం రోజున దర్శించుకునేందుకు అశేష భక్తజనం తరలివచ్చింది. ఇంద్రకీలాద్రికి దిగువున వినాయకుడి గుడి నుంచి క్యూలలోకి ప్రవేశించి కొండమీదకు వెళ్ళి అమ్మను దర్శించుకునేసరికి 3.30 గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం క్యూలలో భక్తులను వేగంగా పంపించటంతో దర్శన సమయం 2.30 గంటలకు తగ్గింది. మధ్యాహ్నం అమ్మవారి నైవేద్యం సందర్భంలో గంట పాటు క్యూలలో భక్తజనులు అలానే ఉండి పోవాల్సి వచ్చింది. దీంతో సమయం మళ్ళీ 3.30 గంటలకు పెరిగింది. సాయంత్రం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రొటోకాల్‌ దర్శనాలు ఇబ్బడి ముబ్బడిగా జరగటంతో.. సామాన్య భక్తులకు ఇబ్బందికరంగా మారింది. అమ్మవారి మూలానక్షత్రం రోజున రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు వస్తారని తెలుసు. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అశేష భక్తజనవాహిని శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్యూలలో కూర్చుని పడిగాపులు పడటంతో.. గంట ముందుగానే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించటం జరిగింది. అలా మొదలైన భక్తజన ప్రవాహం ఆగలేదు. నిరంతరాయంగా క్యూలలో రాత్రి ఆలయాన్ని మూసివేసే వరకు కొనసాగింది. వినాయకుడి గుడిని దాటిన తర్వాత కంట్రోల్‌ రూమ్‌ ఫ్లై ఓవర్‌ దగ్గర రద్దీ విపరీతంగా ఉండటం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ రద్దీ ఏర్పడితే క్యూలలో తొక్కిసలాటకు దారి తీస్తుందన్న ఉద్దేశ్యంతో పోలీసులు భక్తులను సీతమ్మవారి పాదాల దగ్గర ఉన్న యార్డుకు తరలించారు. వీరిని దఫాలుగా క్యూలలోకి పంపించారు. ఇలా రెగ్యులేట్‌ చేయటం వల్ల కొండ దిగువన ఇబ్బందికర పరిస్థితి తలెత్తలేదు. తొక్కిసలాటకు అవకాశం లేకుండా 15 వేల మందిని

హోల్డింగ్‌ చేసేలా
రోప్‌లతో నియంత్రిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ .. టోల్‌గేట్‌ దగ్గర ఒక చోట మాత్రం రోప్‌ పార్టీతో హోల్డింగ్‌ చే శారు. చాలామంది భక్తులు ఉపవాస దీక్షలు చేసి అమ్మ సన్నిధానానికి వచ్చారు. మరికొందరు పుస్తకాలను తమ వెంట తెచ్చుకుని అమ్మ శ్లోకాలను క్యూలలోనే పఠించారు. కొంతమంది భక్తులు అమ్మవారికి పొంగళ్ళను తమ వెంట తీసుకు వచ్చారు. భవానీల సంగతి సరేసరి ! భక్తులు వేచి ఉన్న సమయంలో భవానీలు క్యూలలో పాటలు పాడటం, భజనలు చేయటం భక్తులను అలరించాయి.

అర్ధరాత్రి భక్తుల ఆందోళన
మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను సరస్వతీదేవిగా దర్శించుకునేందుకు భక్తులు వెల్లువలా తరివచ్చారు. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి తగ్గలేదు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లలో భక్తులు బారులు తీరారు. రాత్రి 11.45 గంటలకు గుడిమూసే సమయం ఆసన్నమైనందున అమ్మవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నామని ఆలయ అధికారులు ప్రకటించి క్యూలైన్లలోకి భక్తులను అనుమతించలేదు. దాంతో భక్తులు ఎట్టిపరిస్థితుల్లో అమ్మవారి దర్శనం కల్పించాలని పట్టుబట్టారు. ఎట్టకేలకు ఆలయ అధికారులు దిగివచ్చి దర్శనానికి అనుమతించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *