Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వివేకా హత్య కేసుపై డీజీపీ ఏమన్నారంటే..

వివేకా హత్య కేసుపై డీజీపీ ఏమన్నారంటే..

 

అమరావతి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ జరుగుతోందని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టంచేశారు. వివేకా హత్య కేసుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. అలాగే కిడ్నీ రాకెట్ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖలో డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్టు చేశామన్నారు. ఒక కార్యక్రమం పేరుతో అనుమతి తీసుకుని రేవ్ పార్టీ నిర్వహించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. ప్రతీ నెలా ఏడు నుంచి ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అతి వేగం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని డీజీపీ తేల్చిచెప్పారు.

వివేకానందరెడ్డి దారుణహత్యకు గురై 60 రోజులైన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక సూత్ర, పాత్రధారులెవరన్నది తేల్చేందుకు సిట్‌ మూడు అంశాలపై దృష్టి పెట్టి దర్యాప్తు సాగించింది. వివాహేతర సంబంధాలు, సెటిల్‌మెంటు భూదందాలపై దృష్టి పెట్టి దర్యాప్తు చేపట్టినా ఎలాంటి క్లూ దొరకలేదని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ హత్య వెనుక కుటుంబ సభ్యుల వ్యవహారాలే కారణమని తేలినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. విచారణకు కుటుంబ సభ్యులు సహకరిస్తే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేపధ్యం కలిగిన వివేకా కుటుంబ సభ్యులను గట్టిగా విచారించే పరిస్థితి లేకపోవడంతో ఈ కేసులో పురోగతి సాధించలేకపోతున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి ఈ కేసును నిగ్గు తేల్చేందుకు 11 బృందాలను నియమించి ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యత అప్పగించారు. దాదాపు విచారణ ముగిసినా అందరి కళ్లు వివేకా కుటుంబ సభ్యులపైనే అన్నట్లుగా ఉందని ప్రచారం సాగుతోంది.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *