గుంటూరు :‘ రావాలి ఇసుక – కావాలి ఇసుక ‘ అనే నినాదంతో చేబ్రోలు తహశీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం ధర్నా నిర్వహించారు. చేబ్రోలు సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇసుక లేక ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేలు కరువు భత్యాన్ని చెల్లించాలని, ఇసుక ధరను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. ఇసుక రీచ్ల సంఖ్య, స్టాక్ పాయింట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
