Breaking News
Home / States / కంటోన్మెంట్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా..

కంటోన్మెంట్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా..

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఇవాళ అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. డిపో ముందు భారీ సంఖ్యలో కార్మికులు బైఠాయించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనల నేపథ్యంలో డిపో ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *