Breaking News
Home / Sports / ధోనీ అంటే అంతేమరి.. మార్మోగిన ఆక్లాండ్ స్టేడియం!

ధోనీ అంటే అంతేమరి.. మార్మోగిన ఆక్లాండ్ స్టేడియం!

ఆక్లాండ్: టీమిండియా మాజీ సారథి ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. ప్రాంతం ఏదైనా ధోనీ కనిపిస్తే చాలు అభిమానులు మురిసిపోతుంటారు. ఇటీవల భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు కూడా ఇలా అభిమాన సంద్రంలో ధోనీ తడిసిముద్దయ్యాడు. తనను కలిసేందుకు వచ్చిన వృద్ధురాలిని చూసి ధోనీనే షాకయ్యాడు. తాజాగా, న్యూజిలాండ్‌లోనూ ఇటువంటి అనుభవమే ధోనీకి ఎదురైంది.

ఆక్లాండ్ వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో ధోనీ నామస్మరణతో స్టేడియం మార్మోగింది. విజయ్ శంకర్ మూడో వికెట్‌గా అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న వేళ స్టేడియం మార్మోగింది. అయితే, అది విజయ్ అవుటైనందుకు కాదు.. ఎదురుగా ధోనీ బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తున్నందుకు. ధోనీని చూసిన ప్రేక్షకులు అరుపులు, ఈలలు, కేకలతో స్టేడియాన్ని హోరెత్తించారు.

Check Also

హామిల్టన్ టీ-20లో పోరాడి ఓడిన భారత్

Share this on WhatsAppహామిల్టన్: మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా సెడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఆఖరి టీ-20లో భారత్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *