Breaking News
Home / National / ధోతీ, కుర్తాలో క్రికెట్.. సంస్కృతంలో కామెంట్రీ..

ధోతీ, కుర్తాలో క్రికెట్.. సంస్కృతంలో కామెంట్రీ..

వారణాసి: సాధారణ రోజుల్లో సంస్కృత పఠనంలో నిమగ్నమై ఉండే సంస్కృత విధ్యార్థులు మంగళవారం క్రికెట్‌లో తమ సత్తాను చాటారు. అది కూడా సాంప్రదాయ దుస్తుల్లో క్రికెట్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు. వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత్ విద్యాలయ 75వ వార్షికోత్సవం సందర్భంగా అక్కడి విద్యార్థులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న ప్రతీ విద్యార్థి ధోతీ, కుర్తాలో క్రికెట్ ఆడటం విశేషం. విద్యార్థులతో పాటు అంపైర్లు ధోతీత, కుర్తాలే ధరించారు. ఇక ఈ మ్యాచ్‌లో కామెంట్రీ కూడా సంస్కృతంలో చేశారు.

దీనిపై సంస్కృత టీచర్ గణేశ్ దత్ శాస్త్రి మాట్లాడుతూ ‘‘ఈ టోర్నమెంట్ 10-ఓవర్ల ఫార్మాట్. వారణాసిలోని అన్ని సంస్కృత మహావిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ధోతీ, కుర్తాలు ధరించి వాళ్లు ఆడటం వల్ల టోర్నమెంట్‌లో మరింత ప్రత్యేకత చేకూరుతుంది. కామెంట్రీని కూడా శ్రేష్ట్ నారాయణ్ మిశ్రా, వికాస్ దీక్షిత్‌లు సంస్కృతంలో చేస్తారు. ఈ ట్రోర్నమెంట్‌‌ని సాన్‌స్ర్కిట్ ప్రీమియర్‌ లీగ్‌గా పిలుస్తున్నాము. ప్రతి రోజ వేదాలు, పెన్నులు పట్టుకొనే విద్యార్థులు ఈ రోజు బ్యాట్, బాల్స్ పట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.

Check Also

రాజకీయాలకతీతంగా దాడిని ఖండించాం: రామ్మోహన్‌నాయుడు

Share this on WhatsAppన్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వివరించారని టీడీపీ ఎంపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *