Breaking News
Home / National / ఢిల్లీ మాజీ సిఎం అంత్యక్రియల ఖర్చు ఎంతో తెలుసా?

ఢిల్లీ మాజీ సిఎం అంత్యక్రియల ఖర్చు ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబాధ్‌ ఘాట్‌లో జరిగాయి. స్వతహాగా ప్రకృతి ప్రేమికురాలైన షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు మాత్రం అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా జరిగిపోయాయి. ఇలాగే జరగాలని ఆమె కోరుకున్నారట. సీఎన్‌జీ(కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) పద్ధతిలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఇది కాలుష్య రహిత పద్ధతి, ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు. ఇదే విధానంలో జరిగిన షీలా అంత్యక్రియల ఖర్చు అక్షరాల రూ.500. సాధారణంగా కట్టెలు ఉపయోగించి దహనం చేసినట్లయితే రూ.1,000 ఖర్చవుతుంది. అది కూడా మృతదేహం పూర్తిగా కాలడానికి 1012 గంటల సమయం పడుతుంది. కానీ, సీఎన్జీ పద్ధతిలో అంతిమ సంస్కారాలు చేస్తే మృతదేహం గంటలో కాలిపోతుంది. అయితే షీలా అంత్యక్రియలు ఇలా చేయడాన్ని కొందరు వ్యతిరేకించారు. ఇది హిందూ సంప్రదాయం కాదని దిల్లీలోని కొందరు అర్చకులు అభ్యంతరం తెలిపినప్పటికీ ప్రకృతిని కాపాడటంలో సాటి వారికి షీలా స్ఫూర్తిగా నిలిచారు.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *