Breaking News
Home / Featured / ఏటీఎంలో ఇలాంటి సర్వీసులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

ఏటీఎంలో ఇలాంటి సర్వీసులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

ఏటీఎంలలో కూడా టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు సంతరించుకుంటున్నాయి. కేవలం డబ్బులు తీసుకునే మిషనే కాకుండా.. వివిధ రకాల చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. వీటితో సమయం కూడా చాలా సేవ్ అవుతుంది. గతంలో.. బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవలంటే గగనమయ్యేది. కానీ ఈ ఏటీఎంలు వచ్చిన తరువాత చిటికెల్లో పనులు ఈజీగా అయిపోతున్నాయి.

సాధారణంగా ఏటీఎంలను డబ్బులు డ్రా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ చాలా మందికి ఎటీఎం ద్వారా ఎన్నో సేవలను పొందవచ్చని మీకు తెలుసా? బ్యాంకుల చుట్టూ, సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగకుండా.. కొన్ని పనులను ఏటీఎం ద్వారా చేసుకోవచ్చు మరి అవేంటో తెలుసుకుందామా!

అవి:
1. మొబైల్ రీచార్జ్
2. కరెంట్, వాటర్, ఇంటి బిల్లులు చెల్లింపులు
3. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు
4. ట్యాక్స్ చెల్లింపులు
5. ఫిక్స్‌డ్ డిపాజిట్స్
6. పర్సనల్ లోన్ అప్లికేషన్స్
7. చెక్ బుక్ అభ్యర్థనలు
8. రైల్వే టికెట్స్ బుకింగ్

ఏటీఎం హోమ్‌ పేజ్‌లో అన్ని వివరాలు కనిపిస్తాయి. తదితర రూల్స్‌ని ఫాలో చేస్తే.. ఈజీగా ఆ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Check Also

బాధితులకు మహిళా కమిషన్ అండగా ఉంటుంది

Share this on WhatsAppగుంటూరు: విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఘటనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *