Breaking News
Home / Film News / నాని పాత్రలో ఈ హీరోనే..!

నాని పాత్రలో ఈ హీరోనే..!

ముంబై: చక్కటి కుటుంబ కథా చిత్రాలతో తెలుగులో అగ్ర నిర్మాతగా దిల్‌రాజు రాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన పేరు బాలీవుడ్‌లోనూ వినిపించబోతోంది. ‘జెర్సీ’ రీమేక్‌తో ఆయన నిర్మాతగా హిందీలో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ”జెర్సీ’తో మా హిందీ ప్రొడక్షన్‌ ప్రయాణం ప్రారంభమైంది’ అని పేర్కొంది.

నాని కథానాయకుడిగా నటించిన సినిమా ‘జెర్సీ’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన సినిమా మంచి హిట్‌ అందుకుంది. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. షాహిద్‌ కపూర్‌ కథానాయకుడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఇదే సందర్భంగా షాహిద్‌ క్లాప్‌బోర్డు ఫొటోను షేర్‌ చేశారు. మన కలను నిజం చేసుకోవడానికి ఇప్పటికీ సమయం మించిపోలేదని ట్వీట్‌ చేశారు.

Check Also

భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయండి

Share this on WhatsAppపెట్టుబడులకు అనుకూల పరిస్థితులు అపార వ్యాపార అవకాశాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *