Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / గ్రామ వలంటీర్ల ద్వారా ఇక నేరుగా ఇంటికే సరుకులు

గ్రామ వలంటీర్ల ద్వారా ఇక నేరుగా ఇంటికే సరుకులు

గ్రామ వలంటీర్ల ద్వారా ఇక నేరుగా ఇంటికే సరుకులు
పౌరసరఫరాలశాఖలో సంస్కరణలు
తూర్పు గోదావరి జిల్లా : రేషన్‌కార్డులకు రంగులు మారనున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుతో కార్డులకు కొత్త రంగులు రానున్నాయి. పౌరసరఫరాలశాఖలోను పలు పాలనా సంస్కరణలు రానున్నాయి. రేషన్‌ సరుకులు ఇక నేరుగా ఇంటికే రానున్నాయి. కొత్తగా ఎంపికయ్యే గ్రామ వలంటీర్లకు ఈ బాధ్యత అప్పగించనున్నారు. ప్రభుత్వం అన్ని శాఖల్లోను తీవ్రమైన మార్పులు తీసుకొస్తున్న దృష్ట్యా పథకాలు అమలు కూడా వేగవంతం చేసింది. ఏ ప్రభుత్వానికైనా మైలేజ్‌ రావాలంటే పథకాల అమలులో పేదవారైన లబ్ధిదారులకు సౌకర్యవంతమైన సేవలు ఉండాలి. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పౌరసరఫరాలశాఖలో తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మంచి ఫలితాలు రానున్నాయి.

ప్రతి పేదవాడికి నిత్యావసర సరుకులు రేషన్‌షాపుల ద్వారా అందిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం సీఎం జగన్‌ ఆధ్వర్యంలో జరిగిన మంత్రి మండలి నిర్ణయాల్లో ప్రతి కార్డుదారుడి ఇంటికి నేరుగా సరుకుల పంపిణీ చేయాలని, వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 5, 10, 15 కిలోల చొప్పున రేషన్‌ బియ్యాన్ని అందజేసే క్రమంలో గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా సన్నబియాన్ని ఇవ్వాలని మంత్రి మండలి చర్చించింది. ఈ క్రమంలో ప్రభుత్వం పౌరసరఫరాలశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలపట్ల కార్డుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం
సీఎం వైఎస్‌ జగన్‌, పౌరసరఫరాలశాఖ కార్యదర్శిగా నియమితులైన కోన శశిధర్‌ ఇటీవల సమావేశమయ్యారు. ఈ శాఖలో చేపట్టాల్సిన సంస్కరణల విషయమై చర్చించారు. అందులో భాగంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో సేవలందించేందుకు వీలుగా నియమించే గ్రామ వాలంటీర్లతో లబ్ధిదారుల ఇంటికి నేరుగా సరుకుల పంపిణీ చేపట్టాలని, సంస్కరణల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల రంగులు మార్చి వైసీపీ కలర్‌ను తీసుకురావాలని చర్చించినట్లు పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్కరణ అమల్లో భాగంగా ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న రేషన్‌కార్డులు వైసీపీ పార్టీ రంగులతో రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫొటోతోపాటు ఆ పార్టీకి చెందిన రంగులు కూడా ముద్రించనున్నారు. ప్రభుత్వ రాజముద్ర కూడా కార్డుమీద రానుంది.

జిల్లాలో 16లక్షల50వేల కార్డులు
జిల్లాలో 16లక్షల50వేల వరకూ రేషన్‌కార్డులున్నాయి. కార్డుదారులకు సరుకుల పంపిణీ జిల్లావ్యాప్తంగా ఉన్న 2650 రేషన్‌ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ నిర్వహిస్తున్నారు. ఇకపై మారనున్న విధానాలను అనుసరించి లభ్ధిదారుడు రేషన్‌షాపునకు రాకుండా వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుని ఇంటికే సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం కొత్త ప్రభుత్వం తీసుకురానుంది. పూర్తిస్థాయిలో ఈ సేవలు ఆగస్టు మొదటివారంనుంచి రానున్నాయని తెలుస్తోంది. వాలంటీర్ల నియామకం ప్రధాన ప్రక్రియ కావడం ఒక అంశమైతే కొత్తకార్డుల ముద్రణకు అధిక వ్యయం కావడం మరో అంశమైనా పాలనా సంస్కరణలు వేగవంతంగా ఈ శాఖలో తీసుకురావాలని పౌరసరఫరాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొడాలి నాని భావిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని సన్నబియాన్ని కూడా రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ కానుంది.

Check Also

65 ఏళ్ల మహిళలను టార్గెట్‌గా చేసిన ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్…

Share this on WhatsAppపశ్చిమ గోదావరి: మహిళల మెడలోని బంగారాన్ని లాక్కొని వెళ్లిపోతున్న దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉభయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *