Breaking News
Home / Crime / పోలీసులు నేరుగా నేరాలు జరిగిన ప్రాంతానికి….

పోలీసులు నేరుగా నేరాలు జరిగిన ప్రాంతానికి….

హైదరాబాద్:దిశ.. నిందితులకు అంత తేలిగ్గా లొంగిపోలేదనే విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనపై హత్యాచారం చేస్తారని కూడా ముందే అనుమానించినట్టు తెలుస్తోంది. వాళ్లను ఎదిరించే ధైర్యం చేసి ఓడిపోయిందని నిందితుల తొలిరోజు కస్టడీలో తెలిసినట్టు సమాచారం. పోలీసులు మొత్తం క్రైమ్ సీన్ ను రీ కన్ స్ట్రక్ట్ చేశారు.దిశ కేసు విచారణలో అసలు కథ మొదలైంది. జైలు నుండి నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు నేరుగా నేరాలు జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అర్దరాత్రి జైలు నుంచి నిందితును తీసుకెళ్లిన ప్రత్యేక బృందాలు.. మొదటగా శంషాబాద్ లోని టోల్ గేట్ దగ్గర దర్యాప్తు చేశాయి. గత నెల 27 సాయంత్రం మహ్మద్ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్, శివ అక్కడికి వచ్చాక.. ఏం చేశారాన్నదానిపై సీన్ టు సీన్ రీకన్సట్రక్షన్ చేయించారు. ఆరోజు సాయంత్రం ఐదున్నర నుండి దిశ అక్కడికి వచ్చాక.. ఏం చేశారన్నది పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించారు నలుగురు నిందితులు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *