Breaking News
Home / States / 200 మంది రైతులకు పాడి పశువుల పంపిణీ….

200 మంది రైతులకు పాడి పశువుల పంపిణీ….

సిద్దిపేట: సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న 200 మంది రైతులకు పాడి పశువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, జడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చాలా సంతృప్తినిస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి స్పూర్తిని ఇచ్చింది ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి. నియోజకవర్గంలో 263 మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఆ రైతులందరికీ ఆవులను ఉచితంగా అందిస్తున్నామని, పంపిణీ చేసిన ఆవులను తల్లిలాగా చూసుకోవాలని, ఆవును అమ్మినా, నిర్లక్ష్యంగా వ్యవహరించాలని చర్యలు తప్పవన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఈ ప్రోత్సహం నిరంతరం కొనసాగుతుందని, రైతుబజార్‌లో సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తామని, సేంద్రియ పంటల విక్రయానికి ప్రత్యేక యాప్ ఏర్పాటు చేసి అందులో రైతుల పూర్తి వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *