ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు ఎన్95 మాస్క్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, పొగమంచు బారి నుంచి విద్యార్థులను కాపాడేందుకు రెండు లేయర్లతో కూడిన ఎన్95 మాస్క్లు వారంపాటు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణలో భాగంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో పొలాల్లో కాల్చివేతలను నిలిపేసేలా చూడాలని ఆయా రాష్ర్టాల సీఎంలకు కేజ్రీవాల్ సూచించారు.
