Breaking News
Home / hyderabad / కలవరానికి గురిచేస్తోన్న ‘స్వైన్ ఫ్లూ’…

కలవరానికి గురిచేస్తోన్న ‘స్వైన్ ఫ్లూ’…

హైదరాబాద్ : రాష్ట్రంలో ‘స్వైన్ ఫ్లూ’ జ్వరాలు కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఈ సీజన్‌లో దాదాపు 220 మంది వరకు స్వైన్ ఫ్లూ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో… ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే… వెంటనే చెకప్ చేయించుకోమని చెబుతున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. సగటున రోజుకు 10 మంది ఈ స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడుతున్నట్లు వినవస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.

కిందటి సంవత్సరం ఇదే సమయానికి 330 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ వెల్లడించారు. జనవరిలో మొత్తం 1,656 మందికి పరీక్షలు నిర్వహించగా… వారిలో 307 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు వెల్లడైంది. ఇక ఫిబ్రవరిలో 246 మందికి పరీక్షలు నిర్వహించగా… 23 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో మొత్తం సంఖ్య 330కి చేరుకుంది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *