Breaking News
Home / States / Telangana / దివ్య హత్య కేసు : లొంగిపోయిన ప్రేమోన్మాది

దివ్య హత్య కేసు : లొంగిపోయిన ప్రేమోన్మాది

వేములవాడ: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో మంగళవారం జరిగిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్యకేసులో ప్రధాన నిందితుడు వెంకటేశ్‌గౌడ్‌ బుధవారం వేములవాడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లొంగిపోయిన వెంకటేశ్‌గౌడ్‌ను గజ్వేల్‌ పోలీసులకు అప్పగించినట్లు వేములవాడ పట్టణ సీఐ శ్రీధర్‌ తెలిపారు. అంతకుముందు ఉదయం గజ్వేల్‌ పోలీసులు ప్రత్యేక బలగాలతో వేములవాడలో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వెంకటేశ్‌గౌడ్‌ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. బుధవారం సాయంత్రం నిందితుడు వేములవాడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *