Breaking News
Home / States / నగరంలో ప్రారంభమైన దీపావళి సందడి….

నగరంలో ప్రారంభమైన దీపావళి సందడి….

హైదరాబాద్‌: ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకునే వెలుగుల పండుగ దీపావళి సందడి నగరంలో మొదలైంది. దీపావళిని పురస్కరించుకుని టపాసుల దుకాణాల వద్ద కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే గతంతో పోలిస్తే 25 శాతం వరకు కొనుగోళ్లు తగ్గాయని, అదే విధంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం కూడా అమ్మకాలపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది దూరప్రాంతాల నుండి ప్రజలు బేగంబజార్‌కు వచ్చి మందుగుండు సామగ్రి కొనుగోలు చేసేవారని, ఆర్టీసీ సమ్మె ప్రభావం వల్ల ఈ ఏడాది దూరప్రాంతాల నుండి వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. మార్కెట్‌లోకి గ్రీన్ క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయని, వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని చెప్పారు. అదే విధంగా చైనా క్రాకర్స్ అమ్మకాలను బహిష్కరించి దేశీయ క్రాకర్స్‌నే విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *