వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 27వ తేదీ ఆదివారం నరక చతుర్దశి, దీపావళి పర్వదినం వేడుకలను నిర్వహించారు. నరక చతుర్దశి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళవాయిద్యములు, 3.40 గంటల నుంచి సుప్రభాత సేవ, 4.10 గంటల నుంచి సుప్రభాత హారతి, 4.15 గంటల నుంచి మంగళహారతులు, 4.50 గంటల నుంచి ప్రాతఃకాల పూజ నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు నరకాసుర వధ పురాణ కాలక్షేపం, అనంతరం దీపావళి పర్వదినం సందర్భంగా సాయంత్రం 6-40 గంటలకు శ్రీస్వామివారి కల్యాణమండపంలో ధనలక్ష్మీ పూజ ఘనంగా నిర్వహించారు.
