Breaking News
Home / National / విశ్వాస పరీక్షకు రెడీ అంటున్న డీకే శివ

విశ్వాస పరీక్షకు రెడీ అంటున్న డీకే శివ

బెంగళూరు: పదిరోజులుగా కర్నాటకను రాజకీయ సంక్షోభం కుదిపేస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు ఎలాగైనా కర్ణాటకు చేజిక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. వాళ్లంతా కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారని, విశ్వాస పరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేస్తే వారు సభ్యత్వాన్ని కోల్పోతారని శివకుమార్‌ అన్నారు. అసంతృప్తి ఎమ్మెల్యేల డిమాండ్లను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని, ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని శివకుమార్‌ స్పష్టం చేశారు.

Check Also

రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

Share this on WhatsAppబెంగళూరు: ‘అనర్హత వేటు’ అంశం మరోసారి కర్ణాటక రాజకీయ సంక్షోభం, విశ్వాస పరీక్ష నేపథ్యంలో చర్చకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *