Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సభలో మాట్లాడే హక్కు నాకు లేదా?…

సభలో మాట్లాడే హక్కు నాకు లేదా?…

అమరావతి: అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు?.. తాను కూడా టీడీపీ సభ్యుడినే కదా అని వల్లభనేని వంశీ టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు సభలో మాట్లాడే హక్కు లేదా? అని ప్రశ్నించారు. తన నియోజకవర్గ సమస్యలపైనే సీఎం జగన్‌ను కలిశానని అన్నారు. ముఖ్యమంత్రిని ఎందుకు కలిశావని పేర్కొంటూ తనను టీడీపీ పార్టీ నుంచి తొలగించారన్నారు.

పేదల కోసం వైఎస్‌ ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారని వంశీ కొనియాడారు. పోలవరం కుడికాలువపై మోటార్ల విషయం, ఇంగ్లీష్‌ మీడియం.. తదితర పథకాలు తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై తన అభ్యంతరాలను టీడీపీ పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీలో ఉండలేకపోతున్నానని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌కు వల్లభనేని వంశీ విజ్ఞప్తి చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *