Breaking News
Home / States / ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దు….

ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దు….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు అండగా బీజేపీ ఉంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ భరోసా ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కార్మికులు తమ సమస్యలపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా సమ్మె కొనసాగించాలన్నారు. ఎలాంటి బెదిరింపులకు, తాటాకుచప్పుళ్లకు భయపడవద్దని లక్ష్మణ్ చెప్పారు.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ప్రారంభించి శుక్రవారం నాటికి 21వ రోజుకు చేరిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని బెదిరింపులు చేసినా.. ఏ ఒక్క కార్మికుడు విధులకు హాజరుకాలేదన్నారు. సీఎం తన స్థాయి తగ్గి కార్మికులను విమర్శించడం సభ్య సమాజం మొత్తం గమనించిందన్నారు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మనస్తాపం చెంది, ఒత్తడికి లోనై ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడని.. ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం వాస్తవాలు గమనించాలని, బెదిరింపులకు భయపడేదిలేదని ఆయన స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *