రోజూ పెరుగు తింటే.. మహిళల్లో రొమ్ము కేన్సర్ ముప్పు తగ్గుతుందని బ్రిటన్‌లోని ల్యాన్‌కాస్టర్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. రొమ్ము నాళాల్లో ఉండే హానికారక బ్యాక్టీరియాను పెరుగు తొలగిస్తుందని, దీని ఫలితంగా రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు. పాలలోని ల్యాక్టోజ్‌ను పులియబెట్టే బ్యాక్టీరియా బాలింత మహిళల రొమ్ము నాళాల్లో పేరుకుపోయి కేన్సర్‌కు దారి తీస్తుందని చెప్పారు.
