Breaking News
Home / Film News / ‘సైరా’కు వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఎంతో తెలుసా…?

‘సైరా’కు వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఎంతో తెలుసా…?

ఫిల్మ్ న్యూస్: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. గాంధీ జయంతి సందర్భంగా గత నెల రెండో తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా పరాజయంగానే నిలిచింది.

దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 143 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇందులో ఒక్క తెలుగు వెర్షనే రూ. 134.4 కోట్ల షేర్ సాధించి కలెక్షన్ల పరంగా టాలీవుడ్ టాప్-3లో చోటు దక్కించుకుంది. అయితే ఈ చిత్రం ఇతర భాషల్లో మాత్రం ఘోర పరాజయం పాలైంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *