Breaking News
Home / Film News / గుమ్మడి ఆమెను ఏమని పిలిచేవారో తెలుసా:

గుమ్మడి ఆమెను ఏమని పిలిచేవారో తెలుసా:

హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల ఇక లేరు అన్న విషయం తెలియగానే సినీ పరిశ్రమ యావత్తు దిగ్భ్రాంతికి లోనయిందని, ఒక్కసారిగా మనసు గడ్డకట్టేసినట్టయిందని టీడీపీ నేత, పారిశ్రామిక వేత్త, నటుడు మురళీమోహన్ అన్నారు. కృష్ణుడు పాత్రతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించిన విజయనిర్మల.. ఎన్నో చిత్రాల్లో నటించడమే కాకుండా.. 45 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డు సృష్టించారని.. అలాంటి విజయనిర్మల ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. కుటుంబసభ్యులకు ఎంతబాధ ఉందో గానీ.. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ తమ సొంత కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఎంత బాధపడతారో.. అంత బాధపడుతున్నారని మురళీమోహన్ అన్నారు.

అందరితో మంచిగా ఉండే విజయనిర్మల.. అందరినీ వదలి వెళ్లిపోయారని మురళీమోహన్ విచారం వ్యక్తం చేశారు. నటుడు గుమ్మడి చాలా ప్రేమతో విజయనిర్మలను పని రాక్షసి అని ముద్దుగా పిలిచేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనుకున్న ప్రకారం షెడ్యూల్ పూర్తి అయ్యేవరకు ఆమె విశ్రమించేవారుకాదని మురళీమోహన్ చెప్పారు. అలాంటి మహానటి మనందరి మధ్య లేకపోవడం చాలా దురదృష్టమన్నారు. ‘మా’ అసోషియషన్‌కు ఆమె చాలా సహాయ సహకారాలు అందించారని మురళీమోహన్ కొనియాడారు. దేవుడు ఆమెకు మనశ్సాంతి ఇవ్వాలని కోరుతూ, ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు.

Check Also

ధర్నా చౌక్‌కు చేరుకున్న చంద్రబాబు…

Share this on WhatsAppవిజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఇసుక దీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *