Breaking News
Home / National / తమిళనాడులో డాక్టర్ల నిరవధిక సమ్మె….

తమిళనాడులో డాక్టర్ల నిరవధిక సమ్మె….

తమిళనాడు: శుక్రవారం నుంచి తమిళనాడులో సుమారు 15వేల మంది ప్రభుత్వ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగి పాల్గొంటున్నారు. ఎమర్జెన్సీ, లేబర్ వార్డులకు మాత్రమే డాక్టర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వ డాక్టర్ల సమాఖ్య వెల్లడించింది. ఔట్ పేషెంట్లు, ఇతర ఇన్ పేషెంట్ వార్డులకు సేవలు ఉండవన్నారు. అయితే ప్రభుత్వ డాక్టర్లకు సంబంధించిన మరో సంఘం మాత్రం తాము రెండు రోజులు మాత్రమే సమ్మెలో పాల్గొననున్నట్లు స్పష్టం చేసింది. క్రమక్రమంగా ప్రమోషన్లు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల ప్రభుత్వ డాక్టర్ల తరహాలో తమకు కూడా జీతాలు పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లకు పీజీలో 50 శాతం కోటా ఇవ్వాలన్నారు. డిమాండ్లపై ప్రభుత్వంతో డాక్టర్లు చర్చలు జరిపినా అవి విఫలం అయ్యాయి. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరిగాయని, డాక్టర్లు అంతా తమ విధుల్లో చేరాలని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ విజయభాస్కర్ కోరారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *