Breaking News
Home / National / విద్యార్థులను కలిసే దమ్ము మోడీకి ఉందా? : రాహుల్‌

విద్యార్థులను కలిసే దమ్ము మోడీకి ఉందా? : రాహుల్‌

దేశంలోని విశ్వవిద్యాలయాలకు వెళ్లి.. విద్యార్థులను కలిసే దమ్ము ప్రధాని నరేంద్ర మోడీకి ఉందా? అని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను మోడీ భ్రష్టు పట్టించారని.. దానిపై విద్యార్థులకు సమాధానం ఇవ్వాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారిన దుస్థితి నెలకొని ఉందన్నారు. విద్యార్థుల ముందుకు వెళ్లే ధైర్యం మోడీకి లేదన్నారు రాహుల్‌. దేశానికి మోడీ ఏం చేయదలుచుకున్నారో ప్రజలకు చెప్పాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. దేశాన్ని విభజించే కుట్ర మోడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యువత గొంతును నొక్కేయాలనుకోవడం మంచిది కాదని రాహుల్‌ అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *