Breaking News
Home / National / కశ్మీర్‌ అంశం: ఇరు దేశాధినేతలతో చర్చించడానికి సిద్ధం

కశ్మీర్‌ అంశం: ఇరు దేశాధినేతలతో చర్చించడానికి సిద్ధం

న్యూఢిల్లీ: భారత్‌ బ్రహ్మాండమైన దేశమని… ఈ రెండు రోజుల పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. భారత ప్రజలు గతంలో కంటే ఇప్పుడు తమను మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నారను కుంటున్నానని పేర్కొన్నారు. భారత్‌- పాకిస్తాన్‌ ప్రధానులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని… వారు కోరితే కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. భారత్‌తో 3 బిలియన్‌ డాలర్ల ఒప్పందం చేసుకున్నామని… భారత్‌కు మరిన్ని ఆయుధాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్‌ ఢిల్లీలో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా… ఉగ్రవాదంపై తాను పోరాడినంతగా ఎవరూ పోరాడలేదని.. ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదీని తాము అంతమొందించామని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి​ చేస్తున్నామని.. అమాయక ప్రజలను చంపితే ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే అమెరికా ప్రపంచానికి పోలీసు కాదని.. ఉగ్రవాదంపై అందరూ మరింత పోరాటం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం భారత్‌కు ప్రయోజనకరమని ట్రంప్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించానని తెలిపారు. కశ్మీర్‌ అంశం భారత్‌- పాక్‌లకు ముల్లు వంటిదని.. ఈ విషయంలో తాను ఇరు దేశాధినేతలతో చర్చించడానికి సిద్ధమని తెలిపారు.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *