ఫిల్మ్ న్యూస్: పలు రంగాల్లో స్త్రీలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ వేధింపులపై మహిళలు ప్రారంభించిన సోషల్ మీడియా ఉద్యమం `మీ టూ`. హాలీవుడ్లో ప్రారంభమైన ఈ ఉద్యమం బాలీవుడ్‌కి పాకింది. ఉత్తరాదితోపాటు, దక్షిణాది సినీ పరిశ్రమకి చెందిన పలువురు మహిళలు వారు ఎదుర్కొన్న లైంగిక సమస్యలపై సోషల్ మీడియాలో గళమెత్తారు. ప్రస్తుతం ఈ ఉద్యమం కాస్త చల్లబడిందనే చెప్పాలి. ఇప్పటికీ కొంత మంది హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న లైంగిక సమస్యలను చెబుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో ‘మీ టూ’ ఉద్యమం గురించి మాట్లాడారు.
” మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక సమస్యలపై స్పందించడం చాలా మంచి పరిణామమే. మహిళలు లైంగిక సమస్యలను ఎదుర్కొనడం సినిమా రంగంలోనే కాదు ప్రతి రంగంలోనూ ఉంది. అయితే ‘మీ టూ’ ఘటనలను వినేటప్పుడు గుడ్డిగా నమ్మవద్దు. ప్రజలు సున్నితంగా వ్యవహరించాలి. ఈ శక్తివంతమైన ఉద్యమం మొదలైన తర్వాత వేధించాలంటే భయపడుతున్నార “ని ప్రియమణి అన్నారు.