హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసిఆర్‌పై విమర్శలు చేశారు. సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లును కేసిఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కాగా 85 వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులపై సీఎం కేసిఆర్ కన్నేశారన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. అంతేకాక ప్రభుత్వంతో పోరాడి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను సాధించుకోవాలన్నారు. కాగా రేపటి తెలంగాణ బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.
