Breaking News
Home / National / స్మృతి ఇరానీ విన్నూత పోస్ట్…

స్మృతి ఇరానీ విన్నూత పోస్ట్…

ఢిల్లీ: ఏ ప్రత్యేక దినం వచ్చినా స్మృతి ఇరానీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆమె పోస్ట్‌ల కోసం ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆమె అందరికీ విభిన్నంగా, కాస్త హాస్య చతురతతో ఆ ప్రత్యేక దినం గురించి అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మహాత్ముడి 150వ జయంతిని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెబుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అది అభిమానులను ఎంతో ఆకర్షిస్తుండటంతో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్‌లో.. అప్పట్లో మహాత్మాగాంధీ బోధించిన మూడు కోతుల చిత్రాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనేది ఆ మూడు కోతుల సారాంశం. అయితే ప్రస్తుతం అంతా డిజిటల్‌ మయం కావడంతో స్మృతి దాన్ని కాస్త మార్చి డిజిటల్‌ ప్రపంచాన్ని ఉద్దేశించేలా పోస్ట్ చేశారు. చెడు పదాలు టైప్‌ చేయకు, చెడు వాటిని లైక్‌ చేయకు, చెడు వాటిని షేర్‌ చేయకు అని పోస్ట్‌ చేశారు. ఇలా స్మృతి ఎప్పటికప్పుడు వినూత్న పోస్ట్‌లతో తన 6.7 లక్షల ఫాలోవర్స్‌కు హాస్యాన్ని పంచుతూ అందుబాటులో ఉంటారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *